Friday, March 16, 2012

A letter to Grandma(అమ్మమ్మా,చెప్పవూ!)స్థూలంగా ఇదీ లేఖ.రాసినప్పుడు పాప వయసు ఏడేండ్లు.తరగతిలో అమ్మమ్మకు లేఖ రాయమంటే రాసినది,అమ్మమ్మకు పోస్టులో అందింది.దేశమేదైనా పసిమనసుల ఆలోచనా ధోరణి ఒకటేనన్నది సుస్పష్టం.I am learning about life long ago in school.Avni, I assume that you were learning how life was?Right!మనిషికి జీవితమే పాఠశాల.పిల్లలకు పాఠశాలే జీవితం.

Did you ever get to see a war going on or was there a war going on in your childhood?

Avni,I am lucky as I was born after independence but I heard many stories about freedom fight.As I grew I read the stories of our great leaders and their struggle of war in a peaceful way.

మీ బాల్యమెలా ఉండేది అని అడిగితే ఒక క్షణం ఆలోచనలో పడ్డాను.
మా బాల్యంలో....
కంప్యూటరు లేదు!సెల్ ఫోను లేదు, అంతెందుకు ల్యాండ్ ఫోనే లేదు!సినిమా...ఊ...ఏడాదికి ఒకటో,రెండో అదే పెద్ద సంబరం.
టి.వి అసలేలేదు. అదేమిటీ....!పిజ్జాలు,బర్గర్లు అంటుంటారే,అవి మేమెరుగము.
మాకు అందుబాటులోనున్నవి మీకు ఏమీలేవా...అయ్యో పాపం!
I thought she took pity on me but I felt sad after I heard that she is missing what we had in our childhood.

నేటి బాలబాలికలు కోల్పోతున్న బంగారుక్షణాలెన్నో!ఎన్నెన్నో!

అమ్మమ్మ,నానమ్మల కథల జోలలు,తాతయ్యల ముద్దు మురిపాలు,నిత్యం కళ్లల్లో కనిపెట్టుకునే అమ్మనాన్నలు, వెన్నెలకుప్ప,కుచ్చుకుచ్చు పుల్ల,వామనగుంటలు,బంధాల బంధనాలు,ఉమ్మడి పండుగలు,స్వచ్ఛమైన నేతివంటలు,ఉత్తరాల ఊసులు,పుస్తకాల రాశులు!ఆకాశవాణిలో సంక్షిప్త శబ్దచిత్రాలు,మాటలు,పాటలు,నాటికలు కలగలిసిన బాలానందం!జయజయ ప్రియ భారత జనయిత్రి ...నేర్చుకున్న పాట ఇప్పటికీ చెవులలో మ్రోగుతోంది.
In India were schools strict?

అమ్మో!చూచివ్రాత గుండ్రంగా లేకపోతే అరచెయ్యి ఎర్రగా కందిపోయేది గోరింటాకు పండినట్లు!అందుకే ఇంత గుండ్రంగా!!!హమ్మ్!టైపు చేస్తున్నాను కదూ!సారీ!

బడిలో టీచర్లు కొట్టేవారు పేము(ప్రేమ) బెత్తంతో,ఆప్యాయంగా పిలిచి మిఠాయిలు పెట్టి మంచి మాటలతో బుద్ధిని వికసింపచేసేవారు.కొట్టినప్పుడు కాదు,మాక్కాస్త బుద్ధివచ్చాక!టీచరు దెబ్బకు,అమ్మ దెబ్బకు ఆనాడు తేడా లేదు.
జ్ఞాపకాల తుట్టె కదిపితే చాలు మనసు చెమ్మగిలుతుంది,కళ్లు తడుస్తాయి.

కథల,వ్యాసాల మధ్య అనుకోకుండా కనబడిన అవని లేఖ ఈ పోస్టుకు కారణమైంది.
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

6 comments:

Plus ఎందుకో ? ఏమో ! said...

heart Touching

<3

జ్యోతిర్మయి said...

లేఖ బావుందండీ..పోయినేడాది ఇండియాలో ఉన్న అమ్మమ్మలకు, నాన్నమ్మలకు తెలుగు తరగతి పిల్లలు లేఖలు వ్రాశారు. మనం ఇప్పుడు కూడా వాళ్ళను లేఖ వ్రాయమని ప్రోత్సహించవచ్చు. ఆ అనుబంధాలు నిలవాలంటే ఇదో మార్గం.

మధురవాణి said...

Absolute beauty! మనవరాలు ముచ్చటైన జాబుకి అమ్మమ్మ గారు రాసిన జవాబు మరింత అందంగా ఉంది. మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. :)

C.ఉమాదేవి said...

ఎందుకో ఏమో గారి స్పందనకు ధన్యవాదాలు.జ్యోతిర్మయిగారు లేఖానుబంధాలు మనసున నిత్యజ్ఞాపకాలు.కంప్యూటర్ మెయిల్ తరచి చూసేలోగా మనసును తాకుతుంది లేఖా పరిమళం.మధురవాణిగారు మనవరాలి వరమీ లేఖ!

వెంకట రాజారావు . లక్కాకుల said...

నేడు బాల్యాన్ని ‘ మెషిను ‘ గా నెంచి ‘ స్కూళ్ళు ,
యిళ్ళు’ – సహజ పరిణతికి చెల్లు పలుకు ,
మించి బాల్యమ్ము నవనవోన్మేష మగుచు
నెదుగు ‘ ఆరోజు ‘ లింక రావేమొ ? యకట !

బ్లాగు: సుజన-సృజన

C.ఉమాదేవి said...

రాజారావుగారు, మీ స్పందనకు పద్యరూపమునిచ్చి నా నాలుగు మాటలకు విలువ పెంచినందుకు ధన్యవాదములు.

Post a Comment