Sunday, December 15, 2013

జూలియస్ సీజర్

ఈ రోజు 15-12-2012 ఆదివారం ఆంధ్రప్రభలో నా సమీక్ష.



        
                         
            లక్ష్మీకాంత మోహన్ అనువదించిన మరో చక్కటి  నాటకం జూలియస్ సీజర్.విలియం షేక్స్ పియర్ చిత్రిక పట్టిన ఆనాటి సమాజస్థితి గతులను తరచి చూడాలంటే చరిత్ర,సాహిత్య పఠనమే రహదారి.చదివిన సాహిత్యానికి దృశ్యీకరణ రసానుభూతికి రాచబాట.అయితే నటన ద్వారా మనం చలనచిత్రాలలోని సన్నివేశాలకు  స్పందిస్తాం కాని నాటక ప్రదర్శనలో  ఈ అనుభూతికి మించిన ఆనందం సాక్షాత్కరిస్తుంది. కారణం ప్రత్యక్షంగా కనబడే పాత్రధారులు.వినబడే గాత్రం,అలరించే హావభావాలు.జీవితమనే నాటకరంగంలో మనిషి జీవనం రంగుల రాట్నమే.
జూలియస్ సీజర్ నాటకానికి వేదిక  రోము నగరం.ఆ తర్వాత  సార్థిస్,ఫిలిప్పీ వస్తాయి. రోమన్ సామ్రాజ్యం పతనావస్థకు చేరినపుడు జూలియస్ సీజర్  పాత్ర ప్రవేశిస్తుంది.న్యాయానికి అన్యాయం, మంచికిపోతే  చెడు ఎదురైంది అనడం వింటుంటాం.అది సర్వసామాన్యంగా జరిగేదే!మంచికి చెడుకు నిత్య సంఘర్షణే. సీజర్ పరిపాలనలో అదే జరిగింది. సీజరుకు వ్యతిరేకంగా పనిచేసి అతడిని అంతమొందిస్తే  అతడికి తల ఒగ్గక బ్రతకవచ్చుననుకుంటాడు కేషియస్.అందుకు తన మిత్రుడైన బ్రూటస్ తో సంప్రదింపులు జరుపుతాడు. 
  సీజర్ భార్యకు వచ్చిన పీడకల సైతం సీజరును భయపెట్టదు.అమాయకత్వాన్ని స్వార్థమెపుడు మాయ చేస్తూనే ఉంటుంది.విజయోత్సవంలో పొంగిపోతున్న సీజరును అప్రమత్తంగా ఉండాలని  చేసిన హెచ్చరికలు అతడిని కాపాడలేకపోయాయి. నమ్మిన స్నేహితుడు బ్రూటస్ సైతం సీజరుపై కత్తిదూసినపుడు యు టు బ్రూటస్! అని ప్రాణాలొదులుతాడు సీజరు. నమ్మినవారు మోసం చేసినపుడు ఈ నాటికి ఎక్కడో ఓ చోట వినబడుతుందీ మాట!
ఇక అనువాదంలో ఇమిడిపోయిన తెలుగు పలుకుబడుల ద్వారా నారికేళపాకాన్ని కదళీపాకం చేసి అందించిన రచయిత అభినందనీయుడు.
రచయితగా,కవిగా స్వయంప్రకాశకుడు ఈ అనువాదకర్త.విలియం షేక్స్ పియర్ రచనలు వసివాడని నిత్య పారిజాత సుమాలు.అదే స్ఫూర్థితో అనువదించబడ్డ పదిహేను నాటికలు కూడా రంగస్థల వేదికపైనే కాదు పాఠకుల హృదయ వేదికపై కూడా సుగంధభరితం కావాలని ఆకాంక్షిద్దాం.                     

                                                                                          
















































  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

2 comments:

నాగరాజ్ said...

సమీక్ష బాగుందండి. జూలియస్ సీజర్ నేను చదవలేదు గానీ, మార్లొన్ బ్రాండో మార్కస్ అంథొనీగా నటించిన మూవీ చూశాను. ఇట్స్ సింప్లీ సూపర్బ్ క్లాసిక్. ఇలాంటి గొప్ప నవలల గురించి కనీసం ఒక ఫుల్ పేజీ రాయగలిగితే బాగుంటుంది. కానీ ఈ పత్రికల వాళ్లు మరీ దారుణంగా తయారైనట్టున్నారు, చిన్న చిన్న బాక్సుల్లో పుస్తక సమీక్షలు వేస్తున్నారు. మీ సమీక్షలన్నీ బాగున్నాయి. థాంక్యూ.

సి.ఉమాదేవి said...

మీరన్నది నిజమే నాగరాజ్ గారు.షేక్స్ పియర్ సాహిత్యం ప్రపంచానికతడిచ్చిన బహుమానం.నేను రాసిన సమీక్షలు నచ్చినందుకు ధన్యవాదాలు.

Post a Comment