Sunday, November 17, 2013

భువన సుందరి


                                                               
                                                                             
                                                 

“  మీకు తోచడంలేదా? బోర్ కొడ్తోందా?అయితే అలా లాంగ్ డ్రయివ్ వెళ్దామా?” అన్న మా అమ్మాయి మాటలకు అమెరికాలో మనకు పొద్దుపోవడం  ఎలా అని ఆలోచిస్తున్న నాకు సంబరం పెరిగి  నన్ను చిన్నపిల్లని చేసేసింది.
ఎందాకా అన్నాను?
చెప్తాగా!” అంది ఊరిస్తూ.
చెప్పు తల్లీ మా బంగారు కదా!” అన్నాను.
మనం బూన్ కు వెళ్తున్నాం అంది.
అక్కడ ఏముంది?” అన్నాను.
నీకిష్టమైనవి!అంతే కాదు గ్రాండ్ ఫాదర్స్ మౌంటెన్ కూడా అంది.
అర్థమైంది చెట్లు,పూలు చూస్తూ అక్కడికి వెళ్తామన్నమాట!
మరిక ఆలస్యం కాలేదు.కుటుంబమంతా చకచకా తయారైపోయాము.
ప్రకృతిలో మమేకమైతే దైవం కళ్లెదుట సాక్షాత్కరించినట్లే!
వాస్తవానికి అరకులోయ నా నోస్టాల్జియా!అందుకేనేమో ఆనాటి జ్ఞాపకాలను తడి ఆరనివ్వని నిరంతర మననంలో ఇలాంటి పయనాలు పునశ్చరణలే!
మాటల కలబోతలో దూరం తరిగిపోతోంది. ఫాల్ ప్రారంభమైందంటే  అమెరికా లో రంగుల హరివిల్లే!పచ్చని చెట్లన్నీ పసుపు,ఆరెంజ్ రంగుల మిశ్రమమై కనువిందు చేస్తున్నాయి.
మాటమరచి,చేష్టలుడిగిన నాకు,
పరచుకున్న కదంబం
అల్లంతదూరాన కనువిందు
మనసు దరిచేరిన హరివిల్లు
కనకాంబరపు లేత వర్ణార్ణవహేల
పచ్చదనానికి మేలి ముసుగు
ఆరని గోరింట గురుతులు
సృష్టికర్త చిలకరించిన పుప్పొడులు
రంగుల హోళీ ఆడుతున్న ప్రకృతికేళి
చూపరుల చూపును నిశ్చలమై నిలిపి
అనిమేషులుగ మార్చిన భూన్ సుందరి
నన్నుఅలరించిన  భువన సుందరే!







  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

0 comments:

Post a Comment