Sunday, November 17, 2013

యోగ విజయాలు

ఈ రోజు ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో నా సమీక్ష.


 యోగవిజయానుభావాల కదంబమాల
                 ఆత్మదర్శనమే పరమయోగం అని తెలిపే ఈ పుస్తకం యోగసాధకుల మాటలలో చెప్పాలంటే ఉపశమింపచేసే మనోయోగం. మన ఎదుగుదల మన మాటలలోనే తెలుసుకోవడం మనోయవనికను తొలగించి అచట పేర్చబడిన యోగాక్షరాలను తిలకించడమే! మాస్టర్ యోగాశ్రమంలో యోగసిధ్ధిపొందిన వారి అనుభవాల సమాహారం ఈ రచన.
        మానసిక,దైహిక బాధలు దైనందిన అతిథులే! యోగ రసాస్వాదనే అందుకు తగిన ఆతిథ్యం. ఆధ్యాత్మిక ఎదుగుదలే యోగాలోని మొదటి లక్ష్యం అంటారు ఎమ్.ఎస్.మూర్తిగారు.గురువు చూపిన దారిలో ఎవరి నడక వారు నడవాలి అంటారు. సాధకులకు సాధనతోపాటు మంచి పుస్తక పఠనం కూడా జ్ఞానసంపదను అభివృద్ధి పరుస్తుంది. ప్రార్థన మనసును ప్రక్షాళన చేస్తుంది.
        యోగసాధకులు తమ అనుభవాల అంతర్వాణిని అక్షరయోగంలో ప్రతిఫలించారు. యోగాశ్రమంలో శారీరక,మానసిక రుగ్మతలకు ఉపశమనం పొందిన వారి హృదయావిష్కరణే ఈ యోగవిజయాలు.
మౌనమే నా యోగభాష అంటారు యోగసాహిత్యం పట్ల  ఆసక్తి, యోగసాధన పట్ల అనురక్తిగల ఎన్,భారతిగారు. కష్టాలకడలి సునామీలా ముంచేస్తుంటే బయటపడేసే కాంతిరేఖ యోగం.అదే జరిగింది వినోదరావు జయశ్రీ గారి అనుభవంలో!
          యోగా నిత్యసాధనగా ఒకవైపు అంకితమవుతూనే అకుంఠిత దీక్షతో డిగ్రీ సాధించి లాయరు కాగలగడం ఆత్మవిశ్వాసానికి పరాకాష్ట అనిపిస్తుంది. మనల్ని కష్టపెట్టిన వారిని,నొప్పించినవారిని క్షమించడం కష్టమే!అయితే యోగాలో మనిషి తన మనసును నియంత్రించుకోగలగడం వీరి అనుభవాలు మనకు తెలుపుతాయి..
             జీవనవిధానం మెరుగు పడాలంటే ఆత్మను తెలుసుకోవాలి.అంటే స్వస్వరూప దర్శనమేనంటారు సి.సుశీలమ్మ గారు.గురువుగారి కరస్పర్శే పరసువేదిలా పనిచేసి తనబిడ్డను శస్త్రచికిత్స బారిన పడకుండా కాపాడింది అంటారు ఎస్.శోభారాణి గారు. క్షమ,ఓర్పువంటి సుగుణాలను అలవరచుకోవాలంటే యోగసాధనే మార్గమని చెప్పిన మరెందరో సాధకుల అనుభవాలు చదవదగ్గవి.


  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

0 comments:

Post a Comment