Thursday, June 20, 2013

పిల్లల్ని చూడాలనుంది!



తల్లికి మనసులో పులకింత,
అబ్బాయి కనబడ్డాడు,
ఫేస్ బుక్ లో తలుపు తీసాక!

తండ్రికి మనసులో తుళ్లింత
నాన్నా అని అమ్మాయి పిలుపు
స్కైప్ లో కిటికీ తెరిచాక

మూతపడ్డాయి తలుపులు, కిటికీలు
  అమ్మ,నాన్నలకు మళ్లీ ఎదురుచూపులే

ఐప్యాడ్,ల్యాప్ టాప్ వచ్చాయి
అయినా పిల్లలు కనబడలేదు
ఆ రెండింటిని తెరవలేక
అమ్మానాన్నలిక నిత్య చకోరాలే!



  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

4 comments:

జలతారు వెన్నెల said...

ఉమా దేవి గారు, ఐపాడ్ , లాప్టాప్ తల్లితండ్రులకు ఎలా వాడాలో తెలియక అంటారా? కాని నేర్చుకుంటే అవే తేలిక అండి, desktop కంటే. మీ కవితను నేను సరిగ్గానే అర్ధం చేసుకున్నానా?

సి.ఉమాదేవి said...

వెన్నెలగారు మీరన్నది నిజమే.అయితే కంప్యూటరు అవగాహనలేని ఎంతోమంది తల్లిదండ్రులు,రాత్రి మా అమ్మాయితో స్కైప్ లో మాట్లాడాను అంటే అయ్యో మాకు కంప్యూటరులో ఇవన్నీ చేయడం రావు అని అన్నప్పుడు కలిగిన కవితావేదనే మరి.

వనజ తాతినేని/VanajaTatineni said...

బావుంది ఉమా గారు. నా చుట్టూనూ ఇలా చాలా మంది ఉన్నారు . నేను ఒకప్పుడు అలానే! :)

సి.ఉమాదేవి said...

మీరన్నది నిజమే వనజగారు.మీ స్పందనకు ధన్యవాదాలు.

Post a Comment