Sunday, June 16, 2013

నాన్నా నమామి!


    

                   అమ్మ! అనగానే అమ్మేకదా,ఏం అనదు అనే భరోసా.అదే నాన్న అనగానే అమ్మో! ఎక్కడివాళ్లక్కడ గప్ చుప్!అందరికీ ఇదే సూత్రం వర్తించక పోవచ్చు అయితే నా విషయంలో మాత్రం అమ్మ దగ్గరకన్నా నాన్న దగ్గరే చనువు ఎక్కువ. అందుకేనేమో నాన్న మమ్మల్ని వీడేదాకా ఆయన వెన్నంటి ఉండగలిగే అవకాశాన్ని ఆ దేవుడు అనుగ్రహించాడు.
          అందరము జీవిస్తాము, మరణిస్తాము. మంచి చేయాలి అని అంతా చెప్తారు అయితే నువ్వు అందరికి మంచి చేయలేకపోవచ్చు కాని ఎవరికి చెడు మాత్రం చేయకు అని చెప్పేవారు.నిజంగా ఆయన జీవితాన్ని కాచి వడబోసి చెప్పిన మాటలు, ఆయన మరణాంతరం కూడా మేము శతక సమానంగా నేటికి వల్లెవేస్తూనే ఉన్నాము.
                   పని చేయడం కష్టంగానే ఉంటుంది,కాని పని పూర్తయాక దొరికే ఆనందం ముందు ఈ కష్టం ఎంత అని అడుగడుగునా మమ్మల్ని కార్యోన్ముఖులను చేయడంలో ఆయన ఓర్పు,నేర్పు ఈనాటికీ చెయ్యి పట్టుకుని నడిపించినట్లే ఉంటుంది.
              ఇక క్రమశిక్షణ మోతాదు మించినా నేటికీ అదే మార్గదర్శిగా దారి చూపుతోంది.భోజనానికి ముందు  మరచిపోకుండా చేతులు కడుక్కోవడం,తినేటప్పుడు చప్పుడు రాకుండా తినడం...ఇలా ఎన్నో రూల్స్ అండ్ రెగులేషన్స్ మా బాల్యంలో మాకు మింగుడు పడేవికావు.అయితే ఆ సారమంతా గ్రహించినవారము కదా మాకు తెలియకుండానే అదే జీవనసరళికి అలవాటుపడిపోయాము.
              తండ్రెపుడు పిల్లల క్షేమాన్నే కాంక్షిస్తాడు.తండ్రి మాట కరుకైనా మనసు వెన్న అన్నది అందరికి అనుభవైకవేద్యమే కదా!
                   ఫాదర్స్ డే సందర్భంగా  నాన్నకు   నమస్సులు!
                 
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

13 comments:

Unknown said...

నాన్నల మీద కొమార్తెలే ఎక్కువ టపాలు రాస్తున్నట్లున్నారు మరి కొమరులు?నాన్నలదినోత్సవ శుభాకాంక్షలు!!

Unknown said...

నాన్న చెప్పిన మంచిని పాటిస్తూ ఆయన్నెప్పటికీ సజీవంగా మీ మనసుల్లో నింపుకున్నారు.
Happy Father's Day!

మాలా కుమార్ said...

నాన్న గురించి బాగా రాసారు.
మీ ఫొటో బాగుంది. ముద్దుగా వున్నారు :)

జయ said...
This comment has been removed by the author.
జయ said...

మనసు దోచేసే నిజం చెప్పారండి. ఎంత బాగుందో.

సి.ఉమాదేవి said...

సూర్యప్రకాష్ గారు మీకు కూడా శుభాకాంక్షలు,ధన్యవాదాలండి.

సి.ఉమాదేవి said...

చిన్నిఆశగారు,తండ్రి మార్గదర్శిగావడం ప్రతి బిడ్డకు వరమే!మీకు కూడా హ్యాపీ ఫాదర్స్ డే.

సి.ఉమాదేవి said...

మాలాగారు ధన్యవాదాలండీ,అది మా నాన్నగారు తీసిన ఫోటోనే మరి!

సి.ఉమాదేవి said...

జయగారు,మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ.

Priya said...

చాలా బాగా రాశారండీ. మీరు కూడా చాలా క్యూట్ గా ఉన్నారు :)

సి.ఉమాదేవి said...

ప్రియగారు మీకు నచ్చినందుకు ధన్యవాదాలండి.

జలతారు వెన్నెల said...

ఫోటో లో ఎవరో భలే ఉన్నారండి.:) :)
కొంచెం ఆలశ్యం గా చూసాను ఈ టపా.అమ్మ ప్రేమ ,నాన్న నీడ ఇవి రెండు జీవితాంతం మనకి ఉంటే అంత కన్నా అదృష్టం ఇంకొకటి ఉండదు.

సి.ఉమాదేవి said...

మీరన్నది నిజమే వెన్నెలగారు!ఆ ఫోటో మా నాన్నే తీసారు.మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

Post a Comment