

9-4-12 సోమవారం ఆంధ్రప్రభ సాహితీగవాక్షంలో నా కవిత.
తనచుట్టుతాను గిరిగీసుకున్నవృత్తం
నలుసై అందని మనిషి నిర్వచనం
కాసుల ప్రాముఖ్యత నల్లని ముసుగై
కుటుంబ ప్రాధాన్యతను కమ్ముకుంది కాలమేఘమై
జీవనపరుగులో ర్యాంకు,బ్యాంకు మంత్రాక్షరాలు
చెట్టంత మనిషి ఆర్థికయంత్రాలకు చెరకుపిప్పి
నొప్పికి లేపనం పచ్చనోటు పసరు
రెక్కలు మొలిచిన మేధో వలసపిట్టలు
అంకుల్ శ్యామ్ ఊయల ఒడిలో
కొట్టే కేరింతలకు డాలర్ల చప్పట్లు
చిరునవ్వులు చిదిమేసిన సాయంత్రాలు
జటాయువైన వృద్ధాప్యం
అలసిన బాల్యాన్ని పొదువుకునే అమ్మ పేరు టి.వి
అంతర్జాలపు పయనంలో గమ్యమెరుగని మజిలీలు
మనిషిని వెతకాలి,వెతకి పట్టుకోవాలి
చిరునామాను నిర్వచించాలి
మనిషి పేరు మానవత్వం
ఆప్యాయతే నివాసం
మంచిమాటే చిరునామా.
4 comments:
"జీవనపరుగులో ర్యాంకు,బ్యాంకు మంత్రాక్షరాలు...
మనిషి పేరు మానవత్వం,ఆప్యాయతే నివాసం ,మంచిమాటే చిరునామా."
చాలా బాగుందండి!
"మనిషి పేరు మానవత్వం
ఆప్యాయతే నివాసం
మంచిమాటే చిరునామా..."
ఈ భావం అద్భుతంగా వుంది.
అభినందనలు..
మీదైన శైలిలో సమస్యను వివరించి పరిష్కారం కూడా సూచించారు.
"మనిషి పేరు మానవత్వం
ఆప్యాయతే నివాసం"
చాలా బావుందండీ..
కష్టేఫలేగారు ధన్యవాదాలండీ,వెన్నెలగారు,శ్రీ లలితగారు,తెలుగు పాటలు గారు,జ్యోతిర్మయిగారు కవితలోని పంక్తులు మిమ్మల్ని ఆకట్టుకున్నందుకు చాలా సంతోషం.
Post a Comment