
వసంతాగమనమదిగో కుహూరవాలు
మామిడిరుచుల ఆస్వాదనకు సవరించిన
ఎలకోయిల కంఠస్వర విన్యాసాలు
శ్రీఖరమునకిదే వీడ్కోలు కైమోడ్పు
కోటిఆశలపల్లకిపై అరుదెంచిన శ్రీనందన ఉగాదికి
శతాభినందనలు సహస్రాభివందనలు
గతించిన చేదు జ్ఞాపకాలకు తీయటిలేహ్యమై రమ్ము
నిరాశచెందిన బ్రతుకుల ఆశల చివురువై ప్రవేశించు
మనుషుల మనసుల మల్లెలు పూయించు
ధవళకాంతులు శాంతి కపోతాలుగ అలరించు
అవని పానుపున హరిత తివాచీయై
రైతన్నకు ఉలికిపాటులేని నిదురనివ్వు
నదుల దోసిట జలప్రదాయినివై
సర్వజనుల నిత్యచలివేంద్రమై భాసించు
శ్రీ నందన ఉగాదికిదె స్వాగత తోరణము
3 comments:
స్వాగత తోరణం బాగా కట్టారు:)
నందన నామ ఉగాది శుభాకాంక్షలండీ:)
క్రొత్త సంవత్సరానికి చక్కని అక్షర తోరణం! ఉగాది శుభాకాంక్షలు!
సుభగారికి,రసజ్ఞగారికి ధన్యవాదాలు.
Post a Comment