

19-2-2012,ఆదివారం,ఆహ్లాదకరమైన వాతావరణం.ఈ నేపథ్యంలో బ్లాగు పుస్తకం ఆవిష్కరణ.అనుబంధంగా బ్లాగ్మిత్రుల పరిచయాలు,బ్లాగ్ముచ్చట్లు,చాక్లెట్లు,బిస్కట్లు వీటితోపాటు వేడివేడి తేనీరు.
విషయపరిజ్ఞానానికి ఆకాశమే హద్దు.తెలియాల్సింది కొండంత,తెలిసింది గోరంత.మనిషి నిత్య విద్యార్థి.అనుభవాలు నిత్యపాఠాలే కాని కంప్యూటరు పాఠాలు నేడు మనిషికి నిత్యపారాయణాలవుతున్నాయి.కంప్యూటరుకు నేను పెట్టుకున్న ముద్దుపేరు అయస్కాంతం.మరి తాకితేచాలు అతుక్కుపోతాంగదా!మరి కంప్యూటరుతో,ఇంటర్నెట్ తో పరిచయం ఉన్నవారు, గూగులమ్మనడిగి అందని జాబిలమ్మనయినా అందిపుచ్చుకునే వారు బ్లాగ్ లోకంలో విహరించేవుంటారు.అయితే తలుపులు తెరచి అందులోకి వెళ్లాలంటే ఎలా అని తటపటాయిస్తూ బ్లాగ్ ముంగిట నిలబడినవారిని ఆప్యాయంగా చేయిపట్టుకుని లోనికి నడిపించగల ఆహ్వానపత్రిక ఈ బ్లాగు పుస్తకం.సుజాతగారు,రెహ్మాన్ గారు అక్షరీకరించి,చిత్రీకరించిన ఈ జుగల్ బందీ అందించిన బ్లాగు విశేషాలు కొత్తవారికి వివరణాత్మకం,పాతవారికి పునశ్చరణ!
ఈ పుస్తకానికి ఊతమిచ్చిన రూపకర్త చావా కిరణ్ కుమార్ గారు సుజాతగారు,రెహ్మాన్ గారు అభినందనీయులు.
బ్లాగులలో తమ ప్రవేశము,పయనం విశేషాలు అందించిన బ్లాగ్మిత్రుల మాటలముత్యాలు హాస్యమిళితమై అలరించడమేకాదు బ్లాగ్ స్ఫూర్తిని కలిగించాయి.వీరందరికీ పేరుపేరునా బ్లాగాభినందనలు. బ్లాగు రాయాలన్న ఔత్సాహికులకు నిజంగా కరదీపికే ఈ పుస్తకం.
4 comments:
సహృదయంతో మీరు రాసిన నాలుగు ఈ మాటలూ మాకెంతో విలువైనవి ఉమాదేవి గారూ! మీరు సభలో కూడా ఎంతో విలువైన మాటలు మాట్లాడారు. ధన్యవాదాలు
మీ సత్వర స్పందనకు ధన్యవాదాలు సుజాత గారు,
మీ లక్ష్యసాధనలో మరిన్ని విజయాలకై నా శుభాకాంక్షలు.
e book akkada dorukutundi andi?
ebook la free download amina kudurutunda?
http://sriluarts.blogspot.com
మీరు onlineలో order చేసుకోవాలంటేsupport@supatha.in help తీసుకోవచ్చు.వారి సైటు supatha.in చూడండి.Sri Lakshmi garu, thank you for visiting my blog.
Post a Comment