Saturday, May 26, 2012

చదివితే చాలు


పుస్తకావిష్కరణ
పుస్తకానికి పుట్టిన రోజు
పొగడ్తల పొగడమాలలు
చప్పట్ల జలతారులు
మరీమరీ చదువుతారని
ఉప్పొంగింది పుస్తకం మనసు
నక్కిదాక్కుంది పచ్చనోటు
చిన్నబోయింది పుస్తకం
అట్టనలగని ప్రతులు వేనవేలు
బీరువాల్లో పేరుకున్న అక్షరలక్షలు
డబ్బుకట్టలనుకుని దోపిడీ చేసి
గ్రంథాలయాల చెంత వదిలితే మేలు
అప్పుడైనా చదువరులు
చదివితే చాలు,అదే పదివేలు.
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

13 comments:

Padmarpita said...

నిజమే...మీరన్నది అదేపదివేలు.

భాస్కర్ కె said...

very nice

జ్యోతిర్మయి said...

ఉమాదేవి గారూ...రచయిత బాధను పుస్తకానికి అన్వయించి చాలా చక్కగా చెప్పారు. 'అక్షరలక్షలు' నేలమాళిగలో నిధులైపోతున్నాయి.

వనజ తాతినేని/VanajaTatineni said...

అక్షర జ్ఞానం ప్రవహించకుండా బందీ అయి ఉండటాన్ని బాగా చెప్పారు. పుస్తకం విలువ చదివినప్పుడే కదా పెరిగేది.
బాగా చెప్పారు.

Sai said...

Nice.. బాగా చెప్పారు

జలతారు వెన్నెల said...

చాలా బాగుందండి ఉమా దేవి గారు!

సి.ఉమాదేవి said...

పద్మార్పిత గారు,భాస్కర్ గారు ధన్యవాదాలండి.

సి.ఉమాదేవి said...

జ్యోతిర్మయిగారు,వనజగారు మీ మాటలు నిజం.ధన్యవాదాలండీ

సి.ఉమాదేవి said...

సాయిగారు,వెన్నెలగారు మీకు నచ్చినందుకు సంతోషం.

కాయల నాగేంద్ర said...

చాలా బాగా చెప్పారు ఉమాదేవి గారు!

సి.ఉమాదేవి said...

పుస్తకం బాధ అందరికీ తెలుసు.అయితే నేను మరోసారి గుర్తు చేసాను.
నాగేంద్రగారు,ధన్యవాదాలండి.

Lakshmi Raghava said...

పుస్తక రూపం ఇస్తే ఇలా అవుతుందా? అనిపించింది నేనింకా పుస్తకాల ఆలోచనలు చేయలేదు అందుకు సంతోషం. బాగా రాసారు

సి.ఉమాదేవి said...

స్వాగతం,లక్ష్మీరాఘవగారు,మీ స్పందనకు ధన్యవాదాలు.

Post a Comment