Sunday, May 20, 2012

అనుబంధాలు

20-5-12,ఆదివారం ఆంధ్రప్రభలో ప్రచురింపబడిన కవిత.

ఆవిరవుతున్న అనుబంధాలు
కరుగుతున్న అనురాగపు సాకారాలు
మనిషి మనగడకవి శేషప్రశ్నలు
పేగుబంధానికర్థం నిఘంటువులో
చిరిగినపుట
ఆర్థికబంధంతో రక్తసంబంధం
మసకబారినమాట
మమతలను మసి చేసిన ద్రావకం
స్వార్థపుతలపులతో మనసు మలినం
బాంధవ్యాలే బరువని,బంధనాలు తెంచుకుని
ఇదే స్వేచ్ఛా ఊపిరి అనుకుని నినదిస్తే
అనుబంధాలు ఆమ్లధారలో ఆవిరవుతాయి
మనసులోని కాలుష్యం ఉప్పెనలా వుధృతమై
ఆనకట్టలేని కాలకూట విషప్రవాహమై
ఊపిరాడనివ్వదు అగమ్య స్వేచ్ఛాకెరటం
ఉప్పెన మిగిల్చిన కన్నీటి చారికలు
మృగ్యమైన అనుబంధపు ఆనవాళ్లు
బంధాలకు రహదారి మమతల వంతెన
పరిమళించాలి అనుబంధ సుగంధాలు
మానవతాప్రాకారాలకవి చెరగని పునాదులు

  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

3 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

చాలా చిక్కని కవిత ..ఉమా దేవి గారు. అనుబంధాలు అంటే
"మానవతాప్రాకారాలకవి చెరగని పునాదులు" నిజం చెప్పారు.

జలతారు వెన్నెల said...

ఉమాదేవిగారు, స్వార్ధం ప్రతి ఒక్కరిలో ప్రభలిపోయి అనుభందాలను లెక్కచెయ్యని రోజులివి.మీ కవిత చాలా బాగుంది.

సి.ఉమాదేవి said...

వనజగారు,వెన్నెలగారు మీకిరువురికి కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

Post a Comment