Sunday, May 13, 2012

అమ్మంటే!

ఊయలలూగే పాపాయినడుగు
లాలిపాట కమ్మదనం చెప్తుంది
అమ్మగుండెలో దాక్కున్న బుజ్జాయినడుగు
కన్నప్రేమకు త్రాసు లేదంటుంది
గోరు ముద్దలు తినే చిట్టితల్లినడుగు
అమ్మ ఓర్పుకు ఎల్లలు లేవంటుంది
గాయపడ్డ చిట్టితండ్రినడుగు
అమ్మచేతిస్పర్శే లేపనమంటాడు
అమ్మపేరే మంత్రోచ్ఛారణ!
అమ్మమాటే మంత్రం!
గుబులైతే అమ్మ,దిగులైనా అమ్మే
నదులు ఇంకినా ఇంకిపోనిది అమ్మప్రేమే
అలుపెరుగని రోబో అన్నీ అమర్చేఅమ్మ
తనకంట కన్నీరు దాచుకుని
బిడ్డ బ్రతుకున పన్నీరు నింపేదే అమ్మ
అమ్మ అంటే ఎవరో కాదు
ప్రేమకు ప్రతిరూపమే అమ్మ
దైవానికి మరోపేరే అమ్మ
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

19 comments:

రాజ్యలక్ష్మి.N said...

అమ్మ ప్రేమ గురించి,అమ్మ గురించి
చక్కని కవిత చాలా బాగుందండీ..
మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు!

కాయల నాగేంద్ర said...

'అమ్మంటే ఎవరో కాదు
ప్రేమకు ప్రతిరూపమే అమ్మ
దైవానికి మరోపేరే అమ్మ'
ఉమాదేవి గారు! "అమ్మంటే" కవిత చాలా బాగుంది.
ముఖ్యంగా ఈ వాక్యాలు అమ్మకు చక్కని నిర్వచనాలు.
మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు!

వనజ తాతినేని/VanajaTatineni said...

"అమ్మంటే" నిర్వచనం చాలా బాగుంది.
మా తృ దినోత్సవ శుభాకాంక్షలు.

Anonymous said...

అమ్మ అంటే మనల్ని సృష్టించిన బ్రహ్మ.

సి.ఉమాదేవి said...

రాజిగారికి,నాగేంద్రగారికి,వనజగారికి,బోనగిరిగారికి కవితపై స్పందించినందుకు ధన్యవాదాలు.మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

శ్రీలలిత said...

అమ్మని వర్ణించిన మీ కవిత చాలా బాగుందండీ..
మీకు "మదర్స్ డే శుభాకాంక్షలు.."

మాలా కుమార్ said...

అమ్మ గురించి మంచి కవిత వ్రాసారు .
మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు .

జలతారు వెన్నెల said...

ఉమా దేవి గారు, మీరేనా చిత్రం లో ? అమ్మ గురించి ఎంత చక్కగా చెప్పారండి.అభినందనలు మీకు!

సి.ఉమాదేవి said...

శ్రీలలితగారు,మాలాకుమార్ గారు,మీకు కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు.కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

సి.ఉమాదేవి said...

వెన్నెలగారు,అమ్మకవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

శ్రీ said...

అమ్మ గురించి
చక్కని కవిత చాలా బాగుందండీ..

సి.ఉమాదేవి said...

శ్రీ గారు,అమ్మ కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

జ్యోతిర్మయి said...

ఉమాదేవి గారూ అమ్మకవిత చాలా బావుందండీ...

సి.ఉమాదేవి said...

జ్యోతిర్మయిగారు, అమ్మకవిత నచ్చినందుకు చాలా సంతోషం.ధన్యవాదాలు.

lakshmimadhav said...

ammapai kavita chaalaa baagundanDi. chaduvutunTE ollu jhallumandi. aalasyamgaa cheptunnanduku sorry....meeku naa maatrudinOtsava Subhaakaankshalu.

సి.ఉమాదేవి said...

కవిత నచ్చినందుకు ధన్యవాదాలు లక్ష్మిమాధవ్ గారు.

syed.faruk said...

నమస్తే మడమ్.
మీరు రాసినా "అమ్మంటే" కవితా నాకు బాగా నచ్చింది. ఇలాంటి కవితా తెలుగులోనే కాదు హింది భాషలో ఉండాలన్నధి నా అభిప్రాయం. అందుకోసమే ఈ కవితనీ నేను తెలుగు నుండి హింది భాషలో అనువాదము చేయాలనుకుంటున్నాను. అందుకు మీరు అంగీకారము తెలుపుతారని ఆశిస్తూ..
ఇట్లు: ఫారుక్ ఎస్.డి
Email Id: syed.faruk9@gmail.com
Ph No:9032711212

mdhar said...

అమ్మ పిలుపు మాధుర్యంతో కూడినది. ఆమె మనకు జన్మనిచ్చినందుకు ఆమె రుణం తీర్చుకోవాలి. అమ్మకు ఆదరణ ఆనందం ఇవ్వడం మన బాధ్యత. మీ కవిత చదువుతుంటే అమ్మ మీద మమకారం వర్ణనాతీతమైన భావాలు మదిలో మెదిలాయి. ఉమాదేవిగారికి ధన్యవాదములు.

mdhar said...

అమ్మ పిలుపు మాధుర్యంతో కూడినది. ఆమె మనకు జన్మనిచ్చినందుకు ఆమె రుణం తీర్చుకోవాలి. అమ్మకు ఆదరణ ఆనందం ఇవ్వడం మన బాధ్యత. మీ కవిత చదువుతుంటే అమ్మ మీద మమకారం వర్ణనాతీతమైన భావాలు మదిలో మెదిలాయి. ఉమాదేవిగారికి ధన్యవాదములు.

Post a Comment