Monday, April 23, 2012

ఆటవిడుపులో ఆటలు

              ఆనాటి నోములు,పేరంటాలునుండి ఈనాటి కిట్టీపార్టీల వరకు రూపమేదైనా రూపుదిద్దుకునేది మాత్రం ఆటవిడుపే!అలాంటిదే బ్లాగ్ ప్రమదల బ్లాగావని. దైనందిన జీవితంలో ఎవరికి వారు ఎన్నో ఒత్తిడులకు గురవడం సహజం.అటువంటివారికి పెద్దలు వేసే మాటలమంత్రాలు సేదదీర్చి మనసుకు హాయికొల్పుతాయి.మరి పెద్దలకే విసుగు,ఒత్తిడి ఎదురయితే వారికి మందు పిల్లలు వారి పిల్లలు.మరి ఈ అవకాశం దొరకని మనకు తన తలుపులు తెరిచిన బ్లాగ్ప్రపంచం పెద్ద,చిన్నతేడా లేక నాలుగు అక్షరాలు కలబోసుకుంటే చాలు ఆర్తిగా పలకరించి అక్కున చేర్చుకుంటుంది.ఈ బ్లాగ్విశ్వంలో ఎన్నో చలువ పందిళ్లు!అందులో చక్కని బ్లాగుల వేదికలు.బ్లాగులో నామమాత్రపు పరిచయాలే కాని ఆత్మీయతకు కొదవలేదు.కలిసి పంచుకున్నది భోజనం కాదు మమతల పరిమళాన్ని.నిన్నటి ఆదివారం నగరం అగ్నిగుండమే కాని మనసుల చల్లని నీడ మరిపించింది.ఆటవిడుపులో ఆటపాటలు ముగింపుకొస్తుంటే ఆనాటి బాలానందం గుర్తుకొచ్చింది.
ఆటలు,పాటలు,నాటికలు నేటికి ఇక చాలిద్దామా......ఇళ్లకు ఇపుడు పోదామా....గబగబగబ.... అంటూ రేడియోలో పాట అయిపోయేవరకు వేసిన చిందులు! ఓహ్!జ్ఞాపకాల పూలు రాల్చిన ఆదివారం!
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

10 comments:

జ్యోతిర్మయి said...

ఉమా దేవి గారూ..మీ జ్ఞాపకాల పరిమళం ఖండాంతరాల వరకూ వ్యాపించిందండీ..అయ్యో హైదరాబాద్ లో లేకపోతినే అని బాధ కూడా కలిగింది. పంచుకున్నందుకు ధన్యవాదాలు.

జలతారు వెన్నెల said...

ఉమాదేవి గారు మళ్ళీ ఎప్పుడు కలుస్తున్నారో కొంచెం ఒక ఇడియా ఇస్తారా?

సి.ఉమాదేవి said...

జ్యోతిర్మయిగారు భూగోళం ఖండాలుగా విభజింపబడినా భూమి బిడ్డలు విడిపోలేదు అని మన బ్లాగు ప్రపంచం చాటుతోంది.

సి.ఉమాదేవి said...

వెన్నెలగారు,మే నెల 6వ తేది కలవాలనుకుంటున్నాము.

జయ said...

ఉమాదేవి గారు, చాలా బాగుందండి మీ ఆటవిడుపు.

సి.ఉమాదేవి said...

మీకు నచ్చినందుకు చాలా సంతోషం జయగారు.

Ramani Rao said...

simple and super

సి.ఉమాదేవి said...

Thank you Ramani garu.

మాలా కుమార్ said...

సింపుల్ గా చక్కగా రాసారండి .

సి.ఉమాదేవి said...

థ్యాంక్యూ మాలాగారు.

Post a Comment