Thursday, July 12, 2012

రైతు హృదయక్షేత్రం

దేశానికి వెన్నెముక
వెన్ను విరిగి వెక్కుతున్న రైతన్న
వరుణిడి కరుణరాలకున్నా
బోరుబావి బోరుమన్నా
సాగునీరులేక పంటసాగిలపడినా
రైతన్న కళ్లలో నిత్యవర్షమే
విత్తనాల మ్యాజిక్కులు
ఎరువుల జిమ్మిక్కులు
రైతులెరుగని లాజిక్కులు
ధర్మం కుంటుతోంది
ఋతుధర్మానిదీ అదేబాట
పురుగుకు వెరచి పరుగుపెట్టే పెస్టిసైడు
రైతును కరిగించే సైనైడు
మొలకెత్తని కల్తీ విత్తనాలు
మిగిల్చేది పుడమితల్లికి పురిటి నొప్పులు
దాహమందక తలలు వాల్చేసిన నాట్లు
వేస్తాయి రైతుగుండెపైన నాగలి గాట్లు.
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

12 comments:

జలతారు వెన్నెల said...

ప్చ్... రైతులను తలచుకుంటే బాధగా ఉందండి. రైతు కుట్టుంబాల నుంచే వచ్చాను కనక వారి బాధలను అర్ధం చేసుకోగలను. కవిత చాలా బాగుందండి.

సి.ఉమాదేవి said...

కవిత నచ్చినందుకు ధన్యవాదాలు వెన్నెలగారు.
కవివర!విత్తుచే ఎరువుచే వడ్డీ పిండిన సంస్థచే ఎండ్రిన్ చేతన్
ధరచే వరుణుడిచేతను అరయంగా రైతన్నీల్గె అందరిచేతన్.ఇదీ రైతు స్థితి!

భాస్కర్ కె said...

raithu vethalu theerani kathalu,
good one, keep writing.

సి.ఉమాదేవి said...

Thank you Bhaskar Garu,for your appreciation and encouragement.

Meraj Fathima said...

uma gaaroo kavitha ardhavanthamgaa undi

ఫోటాన్ said...

రైతుల కష్టాలను క్లుప్తంగా బాగా రాసారండి!

నిరంతరమూ వసంతములే.... said...

పంట పండిచడంతోటే తీరలేదండి రైతుల కష్టాలు...ఇంకా వున్నాయి..పండించిన దాన్ని జాగ్రత్త పరుచుకోవడం (గోడౌన్లో)..అమ్ముకోవడం..మధ్యలో దళారులు...గిట్టుబాటు ధర..వగైరాలు!
ఏంటో..ఈ దేశంలో రైతులకే కష్టాలన్నీ!
బాగా వ్రాశారు ఉమాదేవి గారు!

సి.ఉమాదేవి said...

ధన్యవాదాలు ఫాతిమాగారు.

సి.ఉమాదేవి said...

రైతులవి తీరని కష్టాలు హర్షగారు.

సి.ఉమాదేవి said...

మీ స్పందన అక్షరసత్యం సురేష్ గారు.ధన్యవాదాలు.

శశి కళ said...

హ్మ్..నిజమే రైతు కష్టాలు అలాగే ఉన్నాయి

సి.ఉమాదేవి said...

నిజం శశికళగారు.

Post a Comment