Tuesday, May 7, 2013

దీపతోరణం




                     రచన వృత్తి కావచ్చు,ప్రవృత్తి కావచ్చు కాని రచన చేసే వ్యక్తికి మాత్రం రచన  మానసికోల్లాసాన్ని అందిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.స్పందించే మనసులో అలలై ఎగిసిపడే సృజనాత్మక భావాలను  రసాత్మకంగా ఏర్చికూర్చి ఒకచోట పేర్చితే తప్ప అలోచనా కడలి శాంతించదు. రచన మనసునుండి వెలువడేదాక మనసు ఊరుకోదు. రచయితను నిలువనీయదు.
          
               బాల్యంలో మొదలైన  చందమామ, బాలమిత్ర, బుజ్జాయివంటి పుస్తకాల పఠనం రచనాసక్తిని పెంచడంలో దోహదపడిందనే చెప్పాలి. ఊహ తెలిసేనాటికి ఎందరో రచయితలు, రచయిత్రులు, రచించిన విభిన్నరచనలను కథలు, నవలలు,ధారావాహికలుగా (వార,మాస పత్రికలలో) చదవడం మనసునుండి మరలిపోని నిత్యానుభూతి.
               
               వందమంది రచయిత్రుల కథానికల సంకలనమే  దీపతోరణం. సాహితీ చిరపరిచితులు వాసా ప్రభావతి, పొత్తూరి విజయలక్ష్మి,స్వాతి శ్రీపాద, తమిరిశ జానకి గార్లు వెయ్యి పుటల ఈ పుస్తకానికి సంపాదకవర్గంగా నాలుగు స్థంభాలై నిలిచారు. నిత్య కథాయజ్ఞంలో  అలుపెరుగని వేదగిరి రాంబాబుగారు ఈ సంకలనానికి ప్రచురణ బాధ్యత స్వీకరించడం హర్షణీయం. కథాభిమాని వేదగిరి రాంబాబుగారికి  శతమానం భవతి. అంతేకాదు ఈ కృషిలో ప్రత్యక్షంగా,పరోక్షంగా సహకరించిన వారందరు అభినందనీయులే.
        
   దీపతోరణంలో అఖండదీపాల నడుమ నా రచన కూడా ఓ చిరుదివ్వెగా చోటు చేసుకోవడం నా రచనాభిలాషకు మరింత స్ఫూర్తిదాయకం.

  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

5 comments:

శ్రీలలిత said...

వందమంది రచయిత్రులకూ అభినందనలు. పరిచయం చేసిన మీకు ప్రత్యేక అభినందనలు...

వనజ తాతినేని/VanajaTatineni said...

అభినందనలు ఉమాదేవి గారు. దీపతోరణంని పరిచయం చేసినందుకు ధన్యవాదములు.

సి.ఉమాదేవి said...

శ్రీలలితగారు,వనజవనమాలిగారు,
మీ ఇరువురి సత్వర స్పందనకు నమస్కృతులు.

జలతారు వెన్నెల said...

ముందుగా మీకు అభినందనలు ఉమాదేవి గారు.
మీ టపాలు పదే పదే చదవాలని అనిపిస్తాయి.
అంత చక్కటి భాష, భావ వ్యక్తీకరణ మీది.:)

సి.ఉమాదేవి said...

వెన్నెలగారు మీరు వ్యక్తంచేసిన అభిప్రాయం మీ అభిమానమందించిన బహుమతే!

Post a Comment