Sunday, May 5, 2013

గుండు ధైర్యం

     


        నిజమే,గుండు క్రింద నిలబడాలంటే గుండు ధైర్యం అదే గుండె ధైర్యం కావాలనిపించింది.చిత్తూరు జిల్లా,కలికిరి మండలం, మహల్ బహుశ ఆ పరిసరప్రాంతాలకు చెందినవారికే పరిమితం కావచ్చుకాని, అమెరికాలో, లండన్ లో చాలా సంవత్సరాలకు పూర్వమే మహల్  నుండి వెళ్లి స్థిరపడినవారు,అక్కడ ఉద్యోగాలలో చేరి నిలదొక్కుకున్నవారు గుండె ధైర్యం కలవారే! బహుశ బలంగా వీచిన ఆ కొండగాలేనేమో!

              మహల్, గుండ్లూరు నడుమ కనిపించి కనువిందు చేసినదే ఈ గుంటివీరుని కొండ. నిజానికి ఆ గుండుకెంత ధైర్యం! మనమైతే అలా బ్యాలెన్స్ లేకుండా నిలబడగలమా! ఆ గుండు సంగతి తెలిసినవారు దాని వయసు వందేండ్ల పైచిలుకే అంటారు.

               మనవరాలు   వచ్నినపుడు సైట్ సీయింగ్ కు  ఎక్కడికెళ్దామంటే " I want to see places where you have spent your childhood days". అనడంతో జీవితం చరమగీతం  పాడకముందే ఒకసారి నడయాడిన  పరిసరాలను తనివిదీరా చూచి రావాలని ఏ మూలనో ఒదిగివున్న కోరిక ఒక్కసారిగా పెల్లుబికింది.
                 
                   ఇకనేం, ఎడతెగని కారు ప్రయాణం! ఉత్సాహం అలసటను తలెత్తనివ్వలేదు. పల్లెలలో స్పష్టమైన మార్పు కనబడుతోంది. నాగరికత, సాంకేతికత జుగల్ బందీయై పల్లెలను  కొత్తగా చూపిస్తున్నాయి.
నాటి బాలలే నేటి వృద్ధులన్నట్లు నెరసిన బాల్యం పలకరించింది.ఆకాశంలో అక్కడక్కడా ఒక చుక్కలా కొందరు ఉన్నారు.మరికొందరు చుక్కల్లోనే కలిసిపోయారు. ఆనందపు జల్లులు ఒకవైపు మనసును పులకింపచేసినా తలచుకున్న బాంధవ్యాలు  కనుమరుగయ్యాయని తెలిసినపుడు గుండె చెమ్మగిలక మానదు. కాని మహల్ కు కిలోమీటరు దూరంలోనున్న గుంటివీరుని కొండ దానిపై ఏ క్షణంలో పడిపోతుందోనని భయం కలిగించే గుండు మాత్రం అన్నిటికీ సాక్షీ భూతమై నేటికి చెక్కు చెదరక నిలబడి ఉండడం చూస్తే మనిషికి ప్రకృతి పాఠం నేర్పుతుంది అంటారనేమాట నిజమేననిపించక మానదు.మొక్కవోని ధైర్యమే మనిషికి ఆలంబనై ముందుకు నడిపిస్తుందనడం తథ్యం.



  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

2 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

నైస్ ఉమాదేవి గారు . మీ జ్నాపకాలు మీ అనుభూతి మీ వ్యకీకరణ కూడా చాలా చాలా బావుంది.

సి.ఉమాదేవి said...

వనజవనమాలిగారు ఊహకన్నావాస్తవిక అనుభూతులు వ్యక్తీకరించినపుడు మనసుకు దగ్గరవుతాయి.మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

Post a Comment