మనిషీ నన్ను మరిచావా?
నీకెందుకంత ఆవేదన?
ననుచేరే నీరంతా వృథాయనిఅధికశాతం నువ్వే తీసుకో
నదీజలాలలో నావాటా నాకు దొరకనీ
నేను సంతృప్త ద్రావణమైతే
జలపుష్పాలిక వికసించవు
మేఘాలన్నిటిని నింపాను నా ఊపిరినావిరిచేసి
మేఘానంద భాష్పాలు నేలకు నాకు ఉమ్మడికానుక
నను చేరిన జలమంతా దండుగని
నీ ఆవేదన సబబేయైనా
సాంద్రతపెరిగి నామేనంతా ఉప్పుమేటయితే
పరచుకున్న హిమాలయాన్నవుతా
నీవునిలుచున్న పీట పదిలం కావాలంటే
ప్రకృతి చిత్రాన్ని పరిపూర్ణంగా చిత్రించు.
2 comments:
చాలా బాగుందండి ఉమాదేవి గారు.
Thank you Vennela Garu.నచ్చినందుకు సంతోషం.
Post a Comment