అమెరికాలో హైద్రాబాద్ ఎగ్జిబిషన్ ను గుర్తుకు తెచ్చిన కేరీ స్టేట్ ఫేర్ పిల్లలకు,పెద్దలకు లభించిన మరో ఆటవిడుపు. దైనందిన కార్యక్రమాలలో పరుగులు పెట్టే జనానికి ఈ మాత్రం టానిక్ అవసరమే.అప్పుడప్పుడే చలి నేనున్నానంటూ గుర్తుచేస్తోంది.అయినా సరే ఎండ కాపడం పెట్టి చలిని కాస్త కట్టడి చేసింది.
సరదాగా వెళ్లడానికి చరిత్ర చదవక్కరలేదు కదా అనుకోవలసిన పనిలేదు.నా ప్రక్కనే ఉంటుంది చిన్న ఎన్ సైక్లోపీడియా!అదేనండీ నా మనవరాలు.ఈ ఫేర్ జరపడం దాదాపు నూటయాభై సంవత్సరాలకు చేరుకోబోతోంది అని అనుకుంటున్నాం.
ఇది ఎలా మొదలైందో తెలుసా అంది. తెలియదమ్మా అన్నాం!వెంటనే చరిత్రపుటలు తిరగేసింది. వివిధ ప్రదేశాలలో నివసించే రైతులు తాము పండించిన ధాన్యం,పండ్లు,కూరగాయలు ప్రదర్శించే వేదికగా చేసుకుని,ఒకరి వ్యవసాయపద్ధతులను మరొకరు తెలుసుకోవాలనే ఆసక్తి తోనే కాక తద్వారా మరింత దిగుబడిని పొందగలిగే అవకాశాన్ని అందిపుచ్చుకోగలమన్న ఆశయంతో చిన్నచిన్నగా ప్రారంభమైందట ఈ స్టేట్ ఫేర్!
అటు పంటలే కాదు పిగ్ రేస్,డక్ రేస్ అంటూ పిల్లలను ఆకట్టుకుంది.అన్నిటిని మించి రకరకాల రంగుల రాట్నాలు కళ్లను కట్టిపడేస్తాయి.వంటలు,వడ్డింపులు చకచకా జరిగిపోతూ నోరూరించాయి.
పిల్లలను, పెద్దలను కూడా మమ్మల్ని కొనుక్కోరూ అని అర్థించినట్లున్న బొమ్మల కొలువులు పసిపాపలమై కళ్లార్పకుండా చూస్తాము.
ఐ విల్ గెట్ ఆన్ టు ది ఫెర్రీస్ వీల్!వుడ్ యు లైక్ టు జాయిన్ మి?అని అడిగింది నా మనవరాలు.
నిలుచున్న చోటే కళ్లు గిర్రున తిరిగాయి.నా ముఖంలోని భావాలు చదివిందేమో,నావైపోసారి వింతగా,జాలిగా చూసి రంగులరాట్నం ఎక్కడానికి రివ్వున ఎగురుతూ వెళ్లింది.హమ్మయ్య!ఊపిరి పీల్చుకున్నాను.మూడడుగుల ఎత్తున్న పరుపు పైకి ఎగిరి కూర్చోవాలి అమ్మమ్మా,ఇప్పుడు కూర్చోలేకపోతే ఎప్పటికీ ఎగిరి కూర్చోవడం నేర్చుకోలేం అనే పాపాయికి నా అశక్తత వింతే మరి.
సరదాగా తిరిగి తిరిగి అలసిపోయినా మనసు ఉత్సాహాన్ని అంది పుచ్చుకుంది.
5 comments:
manameppudu 16 datamu maanasikangaa...enjoy!!1
Anthegadha Lakshmigaru.
ఉమగారూ!
పిల్లలతో పిల్లలంకావడం పిల్లతరహాగా ఉన్నా పిల్లరికం ముద్దే మరి!
అదూరి.హైమవతి.
మీ అనుభవాలు బాగున్నాయండి,
హైమవతిగారు,భాస్కర్ గారు కారణాంతరాలవలన మీ కామెంట్లకు కాస్త ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించాలి.మీరు నా బ్లాగును చదువుతున్నందుకు ధన్యవాదాలు.
Post a Comment