Monday, October 1, 2012

అడుగడుగున గుడి ఉందీ!

కేరీ (నార్త్ కెరొలీనా)లోని  వెంకటేశ్వరస్వామి దేవాలయం



మనిషి మనడానికి కావలసినది  ఆహారం,నీరు,నిద్ర.ఇంతేనా మరి ఎదగడానికి?ఇవే కదా కావలసినది!! కాదు మనసు ఎదగడానికి!ఓహ్ అదా...దానికి చదువు,  ఇంకా ఉత్తేజాన్నిచ్చే ఆటలు, మైమరిపించే పాటల రసఝరులు.ఇవన్నీ సమకూర్చుకోడానికి మనిషి పడే శ్రమ విభిన్నరూపాలలో ప్రదర్శితమవుతుంటుంది.రైటు సోదరులు విమానం కనిపెట్టకపోతే హైలెస్సా..హైలెస్సా అంటూ రాలేక అమెరికాకు అందనంత దూరంలో ఆగిపోయేవారే కదా?

రవాణా సౌకర్యం ఒకవైపు,రమ్మని పిలుస్తూ తలుపులు బార్లా తెరిచిన విశ్వ విద్యాలయాలు, భారతీయులందుకున్న ఉద్యోగావకాశాలు వెరసి మినీ ఆంధ్రా అని పిలువబడే తెలుగు  వారి గృహసముదాయాలు.పటిష్టమైన భారతీయ కుటుంబవ్యవస్థలో ఉమ్మడికుటుంబమైనా,  చిన్న కుటుంబమైనా అమ్మ,నాన్న- పిల్లల సమాహారమే కదా! వాస్తవానికి ఈ రోజు ప్రపంచ వృద్ధులదినం.అరవై దాటితే ఇక చీవాట్లే అంటూ సర్వేలు చేసి మరీ చెప్తున్నారు. అనుబంధాలను గుర్తు చేసుకుంటూ అమ్మా నాన్నలకు థ్యాంక్స్- గివింగ్ డే అంటూ  ఒకదానినేర్పరచుకుని సంబరపడే అమెరికా బిడ్డల లాగే తమను కన్నవారికి తమవంతుగా చేయగల సాయమేదైనా ఉందా అనుకుని తపనపడే భారతీయ చిన్నారులెందరో ఈ అమెరికాలో తమ మనసులకు మౌనంగా ఓదార్పు లేపనం పూస్తుంటారు.ఇటువంటి వారికి కాస్త ఊరట అటు అమ్మానాన్నలు,ఇటు పిల్లలు వీలునుబట్టి అమెరికా టూర్లు,ఇండియా టూర్లు ప్లాన్ చేయడం. తిరుపతిలో పిల్లలకు తలనీలాలివ్వాలన్నా,అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకోవాలన్నా, యాదగిరిగుట్ట నరసింహస్వామికి నమస్సులిడాలన్నా భక్తిగా ప్రణమిల్లడానికి అడుగడుగునా  దేవాలయాలు ఎన్నోమనకుంటాయి, మరి అమెరికాలో రామా,క్రిష్ణా అనుకోవాలంటే ఎలా అనుకోనక్కరలేకుండా  కేరీ అయినా,కనెక్టికట్ అయినా, న్యూయార్కయినా,న్యూజెర్సీ అయినా గోవిందా అనుకుంటే చాలు కనులముందు ప్రత్యక్షమయే వెంకటేశ్వరస్వామి దేవాలయాలు,శివోహం అంటే  శివాలయాలు! వినాయక నిమజ్జనమట ఇండియాలో అని చెప్పుకునేవారికి ఓపెన్ టాప్ కార్లలో ఊరేగుతూ నిమజ్జనానికి బయలుదేరిన వినాయకులు అమెరికాలో ఉన్నవారికి చూడ చక్కని వేడుక!మన జీవనానికి అన్నీ అమర్చుకున్నా మనల్నినడిపే శక్తి ఎక్కడ ఉంది? అసలు ఉందా లేదా అన్న మీమాంస అటుంచి దేవాలయ ప్రాంగణంలో అడుగిడగానే ఏదో ప్రశాంతత పరిమళమై చుట్టుకుంటుంది.బ్రహ్మమొక్కటే!   
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

6 comments:

జలతారు వెన్నెల said...

దేవాలయాలకు ఇక్కడ కొదవ లేదు ఉమా దేవి గారు.
విచిత్రం ఏమిటి అంటే, కొన్ని స్టేట్స్ లో అవి వ్యాపారంగా కూడా అయ్యాయి.
మీ ఈ పోస్ట్ చాలా బాగుంది, బాగా రాసారు ఇక్కడ తెలుగు వారి గురించి, వారి మనసుల గురించి.

వనజ తాతినేని/VanajaTatineni said...
This comment has been removed by the author.
వనజ తాతినేని/VanajaTatineni said...

manishi ki ..daivika bhaavana anedi manobalam ni penchutundi. saptha samudraalu daatinaa..sare

Moolaalu marichenaa..!? anduke adugadugunaa gudi undi.. andarilonu daivamundi.

chaalaa baagaa express chesaaru. very nice mdm.
October 1, 2012 7:39 AM

శ్రీలలిత said...

గుడి ప్రాంగణంలో కలిగే పవిత్ర భావనను అందరితో పంచుకోవాలనే మీ ఆలోచనను చాలా అందంగా ఆవిష్కరించారు. అభినందనలు...

Anonymous said...

ఈ టపాలోని ఛాయాచిత్రం అస్పష్టంగా ఉంది.

మాలా కుమార్ said...

బాగా రాసారు .

Post a Comment