నిరంతరశ్రమ,పరిశ్రమ మనిషిని ఊపిరి సలపనివ్వవు.అది మనదేశమైనా అమెరికాయైనా ఒకటే.ఆడవారికి ఆటవిడుపు పండుగలు,పేరంటాలు అనుకుంటాం.కాని ఇవి కూడా అమెరికాలో సరిగా పండుగరోజునకాక ఉద్యోగానికి సెలవు రోజైన శని,ఆది వారాలలో జరుపుకోవడం ఆనవాయితీ.ఈ పండుగలు కాక అమ్మాయిలు మాత్రమే గర్ల్స్ నైట్ అవుట్ పేరిట వీకెండ్ లో మన కిట్టీపార్టీని పోలిన పార్టీని ఏర్పాటు చేసుకుంటారు.అమ్మా నువ్వు కూడా రావాలి,అంతా తెలుగువాళ్లే,కాసేపు ఉండి వద్దాం అని పిలిచింది మా అమ్మాయి.పిలవడం ఆలస్యం నైట్ అవుట్ కాసేపే ఎందుకు ఆల్ నైట్ కబుర్లు చెప్పుకుందాం అనుకున్నాను.వచ్చి వారం కాలేదు తెలుగులో మాటలు కలబోసుకోవాలని మనసు తహతహలాడింది.
అరగంట డ్రయివ్!అమ్మాయి కారు నడుపుతుంటే నిశ్చింతగా కూర్చుని తెలుగు పదాలు నెమరేసుకుంటున్నాను.
గమ్యస్థానం చేరుకున్నాము అరగంటలో!ఎదురు వచ్చిన తెలుగు అమ్మాయిలు నమస్కారంతోపాటు మమకారము అందించారు.బింగో,మ్యూజికల్ చెయిర్స్ వంటి ఆటలు ఆడటంతో పాటు మాటల కలబోత అలరించింది.మీరు కథలు,కవితలు రాస్తారటకదా ఆంటీ అని ఆసక్తిగా అడిగారు.అవునమ్మా అని అన్నానో లేదో,అయితే కవితలు చెప్పండి అన్నారు అందరూ. ష్! మాట్లాడకండి!ఆంటీ కవితలు వినిపిస్తారు.అని తమ మాటలాపి నిశ్శబ్దంగా కూర్చున్నారు.ప్రక్కనే పెళ్లి ఫోటోలు చూపుతున్న ల్యాప్ టాప్!బ్లాగు సామ్రాజ్యం వర్ధిల్లాలి! నా బ్లాగు యు.ఆర్.ఎల్ చెప్పాను.అక్కడ పండిన నా కవితలను వినిపించాను.నేపథ్యం వివరించాను.వాళ్లు చదవడానికి ప్రయత్నించారు.ఫరవాలేదు,నెమ్మదిగానైనా తప్పుల్లేకుండా చదివారు.సంతోషమేసింది.నేను స్పష్టంగా చదవడం చూసి ముచ్చటపడ్డారు.తేనెలూరు మన తెలుగుభాష రసాలూరు ఏదేశమైన!
ఇక వెళ్దామా అంది మా అమ్మాయి! చంటిపిల్లలా తల అడ్డంగా ఊపాలనిపించింది. మళ్లీ తెలుగు పిక్ నిక్ తీసుకెళ్తాను అంది. దానికోసం ఎదురు చూస్తూ ఇంటి దారి పట్టాను.ఆ విశేషాలు మరోసారి.

6 comments:
చాలా బావుంది. మరిన్ని కార్యక్రమాలలో పాల్గొని.. మీ రచనా శైలిని, మన తెలుగు వెలుగులని విరజిమ్మండి.
మీ కవితాగానాన్ని గ్రోలిన అమెరికాలోని తెలుగమ్మాయిలకు అభినందనలు.
మీకు బోలెడు అభినందన చందనాలు...
ధన్యవాదాలు వనజవనమాలిగారు,మీ సత్వర వ్యాఖ్య ఉద్దీపనమే!
శ్రీలలిత గారు మీ సూచన ఆచరణీయం.సద్వినియోగపరుస్తాను.
ఎక్కడున్నారు మీరు? San Francisco Bay Area ఐతే, మా వీక్షణం సాహితీ కార్యక్రమాలకు సాదర ఆహ్వానం.
cbrao, Mountain View, CA.
సాహితీ బంధువుకు నమస్కారం.మీ ఆహ్వానానికి ధన్యవాదాలు.నేను నార్త్ కెరోలీనాలో ఉన్నాను.మా అమ్మాయి దగ్గరకు వచ్చాను.
Post a Comment